Jagan: రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని మా ప్రభుత్వం అడ్డుకుంది..! 11 d ago
సీఎం చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అన్నారు. ప్రతి నెల ఒక అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు వచ్చాక బాదుడే బాదుడు మొదలైందని వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడు చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తుంది అన్నారు. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ ప్రతినెలా ఒక అంశాన్ని పట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం వ్యవహారం పై వారి కథనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని, అసలు అధికారంలో ఎవరున్నారని సందేహం వస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలు అయ్యింది. మంత్రుల వాళ్లే, అధికారులు వాళ్ళ మనుషులే, కాకినాడ పోర్ట్ లో కష్టంసు వాళ్లే భద్రత సిబ్బంది వాళ్లే, అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద అన్ని నిందలు వేస్తున్నారని.. ఎవరి మీద దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత బియ్యం కూడా బియ్యం ఎగుమతి చేస్తున్నారు. కానీ, ఆ షిప్ దగ్గరికి మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని విమర్శించారు. బియ్యం ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని, పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నెంబర్ వన్ గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్సీపి ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే దాన్ని పక్కనపెట్టి నేరుగా వాహనాలు ద్వారా లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. కానీ మళ్లీ కుటుంబం ప్రభుత్వం అన్ని పద్ధతులను మర్చి మళ్లీ డీలర్లకు అప్పగించారని వ్యాఖ్యానించారు. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని, ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వటం లేదని దీనివల్లే మళ్ళీ రేషన్ మాఫియా వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలకు కమిషనర్ వెళ్లే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నీరుగారిపోయిందని పేర్కొన్నారు.